కృష్ణా: జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మంగళవారం పామర్రులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు రోప్స్ తెచ్చారని అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా రైతులను పోలీసులు అనుమతించడం లేదు.