SRPT: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన సన్నాహాలు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.