TG: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ‘ఐ-ఎలర్ట్’ పరికరాన్ని అమరుస్తున్నారు. దీని ద్వారా ఆర్టీసీ అధికారులు బస్సు ప్రయాణించే విధానాన్ని పర్యవేక్షించొచ్చు. ఇందులో భాగంగా డ్రైవర్లకు గ్రేడింగ్ ఇస్తారు. 10 పాయింట్లకు 6లోపు గ్రేడింగ్ వస్తే సరిగా నడపనట్లు నిర్ధారిస్తారు.