BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలిమెల, మహాముత్తారం మండలాల్లో ఈ నెల 8 నుంచి 15 వరకు సివిల్ సర్వీసెస్ అధికార బృందం పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.