టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు.
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని తెలిపారు. ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారని అర్థం. అయితే ఈరోజు మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి. ఆగ్రహంలో చెడు అంతా దహనమై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం…ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా…
అలాగే నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతం అందరికీ ఆయురారోగ్యాలు, సకల శుభాలు చేకూర్చాలి. ఉగాది తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి పాటుపడదామని లోకేశ్ తెలిపారు.
తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! నవవసంతం అందరికీ ఆయురారోగ్యాలు, సకల శుభాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగువారి నూతన సంవత్సరాదికి ఆశావహ ధృక్పథంతో స్వాగతం పలుకుదాం. క్రోధినామ ఉగాది తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగతికి, ప్రజాసంక్షేమానికి…