Israel Hamas conflict: గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని భారత్ స్వాగతించింది. ఇది ఒక సానుకూల చర్యగా తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ వివాదం వల్ల ఏర్పడిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. గాజాలో ఇప్పటికీ కొనసాగుతున్న ఘర్షణతో తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నాం. అక్కడ ఏర్పడిన మానవతా సంక్షోభం చాలా తీవ్ర్రమైందని.. దీనివల్ల ఆ ప్రాంతంతో పాటు బయట కూడా అస్థిరత పెరుగుతోందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు.
ఈ ఘర్షణ వల్ల పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపారు. దీన్ని ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. దీనిపై భారత్ ఇప్పటికే తన వైఖరిని తెలిపింది. గాజాలో మానవతా సంక్షోభంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇంకా దిగజారకుండా నిరోధించడానికి అక్కడి ప్రజలకు మానవతా సాయాన్ని తక్షణమే పెంచాల్సిన విషయాన్ని చెప్పారు.