»Transgender Contesting For The Prime Minister In Varanasi Who Is Hemangi Sakhi Mata
Hemangi Sakhi Mata: ప్రధానిపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. ఎవరీ హేమాంగి సఖి మాత!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసీ లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు పోటీగా ఓ ట్రాన్స్‌జెండర్ నిలుచున్నారు. దీంతో హేమంగి సఖి మాత గురించి నెట్టింట్లో చర్చసాగుతోంది.
Transgender contesting for the Prime Minister in Varanasi.. Who is Hemangi Sakhi Mata!
Hemangi Sakhi Mata: ప్రధాని నరేంద్ర మోడీ(PMModi) వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయను పోటీగా అదే నియోజకవర్గం నుంచి ఓ ట్రాన్స్‌జెండర్ బరిలో ఉన్నారు. దీంతో ఆ ట్రాన్స్‌జెండర్ ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి అనేది నెట్టింట్లో తెగ చర్చ సాగుతుంది. అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) కు చెందిన హేమాంగి సఖి మాత గుజరాత్‌లోని వడోదరలో జన్మించారు. ఆమె భగవద్గీతను బోధిస్తున్న మొదటి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తుంపు తెచ్చుకున్నారు. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్‌గా పట్టాభిషిక్తులయ్యారు.
చిన్నతనంలో వారు గుజరాత్ నుంచి ముంబైకి వెళ్లారు. ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. చిన్నతనం నుంచి ఆమెకు దైవభక్తి మెండుగా ఉండేది. తరువాత పూర్తిగా ట్రాన్స్‌గా మారిన తరువాత గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా మారారు. అయితే హిందుధర్మ పరిరక్షణనే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ పార్టీకి, ప్రధానిక మోడీకి ఆమె పోటీగా ఎందుకు ఉందనేది, ఆమె ప్రభావం మోడీపై ఎంత వరకు పడుతుంది అనేదానిపై చర్చ సాగుతోంది. ఇక మోడీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్, ఎస్పీ పార్టీలు సెక్యూలర్ భావజాలం ఉన్నవి. దాంతో హిందుత్వ నినాదం మోడీకి ప్లస్ అయింది. ఇప్పుడు అదే నినాదంతో హేమంగి సఖి మాత పోటీలో ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.