»Criminal Cases Against 28 Ministers In Modis Cabinet
PMModi: మోదీ కేబినెట్లో 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
నూతనంగా ఏర్పడిన ప్రధాని మోడీ కేబినెట్లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. అందులో కేంద్ర హోం సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై కూడా క్రిమినల్ కేసు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
Criminal cases against 28 ministers in Modi's cabinet
PMModi: మోడీ 3.0 నూతన ప్రభుత్వం ఏర్పడింది. 71 మంది కేంద్ర మంత్రలతో జూన్ 9న నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా కొలువుదీరిన కేబినెట్లోని 39 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. తెలంగాణ కరీంనగర్ ఎంపీ కేంద్ర హెం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్‌పై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏడీఆర్ వెల్లడించింది. 71 మంది మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొంది. లోక్ సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగనే ఈ డేటాను సేకరించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది.
ఈ క్రిమినెల్ కేసులు ఉన్న 28 మందిలో 19 మందిపై హత్యాయత్నం, విద్వేష ప్రసంగం, మహిళలపై నేరాలు వంటి తీవ్ర కేసులు ఉన్నట్లు వెల్లడించింది. పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖల సహాయమంత్రి శంతను ఠాకూర్‌పై హత్యాయత్నం కేసు ఉంది. అలాగే విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుఖాంత మజుందార్‌పై కూడా హత్యాయత్నం కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక శంతను ఠాకూర్, మజుందార్, బండి సంజయ్, సురేష్ గోపీ సహా ఐదుగురు సహాయ మంత్రులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపింది.