»Pawan Kalyan Taking Oath As Andhra Pradesh Minister Chiranjeevi Emotional
Pawan Kalyan: పవన్ కల్యాణ్ అనే నేనూ.. చిరంజీవి ఎమోషనల్.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కల్యాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అరుదైన సంఘటలను కెమెరా కళ్లకు చిక్కాయి. ఒకవైపు ఆయన భార్య అన్న లెజనోవా, మరో వైపు అన్నయ్య చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Pawan Kalyan taking oath as Andhra Pradesh Minister.. Chiranjeevi emotional
Pawan Kalyan: కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. ఈ మాటకోసం ఆయన చేసిన దీక్ష నెరవేరింది. లక్షలాది జనసంద్రోహం చూస్తుండగా ఆత్మీయులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంత:కరణశుద్ధితో ఆయన చేసిన ప్రమాణం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది అభిమానులకు, జనసేన కార్యకర్తలకే కాదు ఆయన కుటుంబ సభ్యులకు సైతం ఎమోషనల్ మూమెంట్. కేసరపల్లి వేదికపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రధాని సమక్షంలో పవన్‌తో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ భార్య, అన్నయ్య చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో వారి కళ్లు చెమర్చాయి.
ప్రమాణ స్వీకారం తరువాత కొణిదెల పవన్ కల్యాణ్ భారత ప్రధానికి నమస్కారం చేశారు. గవర్నర్, చంద్రబాబులకు నమస్కారం చేసి అనంతరం అక్కడే ఉన్న విశిష్ట అతిథులు అమిత్ షా, వెంకయ్య నాయుడు, నడ్డా, రజనీకాంత్, బాలయ్యకు గౌరవ నమస్కారం చేశారు. అదే వరుసలో ఉన్న అన్నయ్య చిరంజీవి దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసుకున్నారు. చిరంజీవి ఆశీర్వదించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇక సభ అయిపోయిన తరువాత ప్రధాని సభాప్రాంగణం వదిలి వెళ్లెప్పుడు మరో సంఘటన చోటుచేసుకుంది. పవన్‌ను చిరంజీవిని ఆత్మీయంగా కలిశారు. ఇద్దరి చేయిలను పట్టుకొని విజయసంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.