ఒడిశాలో ఆధికారం ఏర్పాటు చేయనున్న నూతన సీఎం మోహాన్ చరణ్ మాఝీ బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ను కలిశారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Odisha Chief Minister Mohan Charan Majhi invites Naveen Patnaik to take oath
Mohan Charan Majhi: దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఒడిశా రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఎన్నికకాబోతున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో భాగంగానే ఒడిశా మాజీ ముఖ్మమంత్రి బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం నవీన్ పట్నాయక్ నివాసానికి వెళ్లారు. ఆయనతో కాసేపు కూర్చొని ముచ్చటించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
ప్రమాణ స్వీకారానికి కచ్చితంగా వస్తున్నట్లు నవీన్ పట్నాయక్ చెప్పారని మోహన్ చరణ్ మాఝీ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 147 అసెంబ్లీ స్థానాలకు 78 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ బీజేడీ కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. దాదాపు 25 సంవత్సరాలు ఒడిశాకు సీఎంగా పని చేశారు. ఈ ఫలితాలతో రాష్ట్రంలో తొలిసారి బీజేపీ సర్కారు ఏర్పాటు కాబోతోంది.