»Puri Jagannath Today Is The Rath Yatra Of Puri Jagannath
Puri Jagannath: నేడు పూరీ జగన్నాథుని రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది. భక్తులు ఎంతగానే ఎదురుచూసే ఈ రథయాత్రలో దాదాపు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారు.
Puri Jagannath: Today is the Rath Yatra of Puri Jagannath
Puri Jagannath: ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఈరోజు సాయంత్రం అమ్మ ఆలయానికి చేరుకోవాలి. కానీ సేవలు పూర్తయ్యే వరకు సమయం పడుతుంది. ఈ ఏడాది రెండు రోజుల పాటు భక్తులకు రథాలు లాగే భాగ్యం కలగనుంది. ఈ యాత్ర కోసం భక్తులు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంతానికి చేరుకుంటారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 July 7th).. రుణప్రయత్నాలు ఫలిస్తాయి
చెక్కతో తయారు చేసిన ఈ మూడు రథాలలో పెద్ద దానికి 16 భారీ చక్రాలు, 44 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. బలభద్రుడి రథానికి 14 చక్రాలు, 43 అడుగుల ఎత్తు, సుభద్ర దేవీ రథానికి 12 చక్రాలు, 42 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ రథాన్ని 50 మీటర్ల పొడవైన తాళ్లతో లాగుతారు. రథాన్ని లాగడం వల్ల తమకు మంచి జరుగుతుందని, తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుందని ప్రజల నమ్మకం. మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రథయాత్రలో పాల్గొననున్నారు. అలాగే ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రెండు రోజుల రథయాత్రలో దాదాపు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని సమాచారం.