»Puri Ratna Bhandagaram To Open Today After 40 Years
Puri Ratna Bhandagaram: 40 ఏళ్ల తరువాత నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం
పూరీ జగన్నాథ ఆలయం గురించి కథలు, కథలుగా విన్నాము. ప్రతీ ఏట ఎంతో వైభవంగా జరిగే పూరీ రథయాత్రను చూడడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తాయి. వీటన్నింటితో పాటు అక్కడ రత్న భాండాగారం గురించి ఎంతో విశిష్టంగా చెప్పుకుంటారు. ఈ రోజు ఆ గుడిని తెరవనున్నారు.
Puri Ratna Bhandagaram to open today after 40 years
Puri Ratna Bhandagaram: ప్రస్తుతం పూరీలో రథ యాత్ర జరగుతోంది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ ఆలయం గురించి ఎన్నో కథలు విన్నాము. ప్రతీ ఏట ఎంతో వైభవంగా జరిగే పూరీ రథయాత్రను చూడడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తాయి. వీటన్నింటితో పాటు అక్కడ రత్న భాండాగారం గురించి ఎంతో విశిష్టంగా చెప్పుకుంటారు. 40 సంవత్సరాల క్రితం ఒక సారి ఆ గుడి తలుపులు తెరిచి అధికారింగా లెక్కించారు. మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు. జూలై 14న ఆ వైభవం జరగనుంది. అందులో ఎన్ని బంగారు, వెండి వస్తువులు ఉన్నాయి, ధనం ఎంత అనేదానిపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదిరిచూస్తోంది. రత్న భాండాగారాన్ని తెరిచి విలువైన అభరాణాలను, వస్తువులను లెక్కించే బాధ్యత హైకోర్ట్ రిటైర్ట్ జడ్జీ జస్టిస్ బిశ్వనాథ్ రాథ్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు మొత్తం 16 మందితో లెక్కింపు జరగనుంది.
2024లో జరిగిన ఎన్నికల్లో పూరీ జగన్నాథ ఆలయ రత్న భండాగారం విషయాన్ని బీజేపీ ప్రస్తావించింది. బీజేపీ అధికారంలోకి రాగానే జగన్నాథుని ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిపించి అందులో ఉన్న విలువైన వస్తువుల లెక్కలు చెబుతామని చెప్పింది. అనుకున్నట్లుగానే నేడు పని ప్రారంభించారు. అయితే ఈ రత్న భాండాగారాన్ని 1805లో మొదటి సారి అధికారిక లెక్కలు ఇచ్చారు. దానికి సంబంధించిన విషయాలను అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో రాశారు. అందులో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు ఉన్నాయి. అలాగే 1978లో జగన్నాథ ఆలయంలో ఉన్న వాటిని లెక్కించారు. అందులో 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు ఉన్నాయి. దాని తరువాత 1982,1985 లో కూడా రత్న భండాగారాన్ని తెరిచారు కానీ లెక్కలు బయటకు చెప్పలేదు. ఇక నేడు అధికారికంగా లెక్కలు బయటపెట్టనున్నారు.