Odisha: దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని శిక్ష తగ్గింపు
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి దోషిగా తేలిన వ్యక్తికి పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించిన వ్యక్తి రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని, భగవంతుడి ముందు లొంగిపోయాడని ఒడిస్సా హైకోర్టు విచిత్రమైన తీర్పునిచ్చింది.
Odisha: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి దోషిగా తేలిన వ్యక్తికి పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఈ కేసులో ఒడిస్సా హైకోర్టు విచిత్రమైన తీర్పునిచ్చింది. మరణశిక్ష విధించిన వ్యక్తి రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని, భగవంతుడి ముందు లొంగిపోయాడని న్యాయమూర్తి మరణశిక్షను తగ్గిస్తూ అతనికి జీవిత ఖైదు శిక్ష విధించారు. జగత్సింగ్పుర్ జిల్లాలో 2014 ఆగస్టు 21న ఓ ఆరేళ్ల చిన్నారి తన అన్నయ్యతో కలిసి చాక్లెట్లు కొనుక్కుని వస్తుంది. కొందరు కామాంధులు ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హత్యాచారం చేసి చంపేశారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు.
ఒడిశా హైకోర్టు విచిత్రమైన తీర్పు
రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష తగ్గింపు.
ఒడిశా – జగత్సింగ్పుర్ జిల్లాలో 2014 ఆగస్టు 21న ఓ ఆరేళ్ల చిన్నారి తన అన్నతో కలిసి చాక్లెట్లు కొనుక్కొని వస్తుండగా, కామాంధులు అపహరించి… pic.twitter.com/PIOrlO2TkF
ఎస్కే ఆసిఫ్ అలీ, ఎస్కే అబిద్ అలీ సాయంతో తీసుకెళ్లి హత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని దోషిగా నిర్దారించి కోర్టు మరణశిక్ష విధించింది. అబిద్ అలీని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ ఘటనలో అతను రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాడని, చేసిన నేరాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జైలులో అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బాధిత కుటుంబానికి మొదట రూ.1.50 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.10 లక్షలు పెంచింది. ఈ పరిహారాన్ని చిన్నారి కుటుంబానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.