»Himanth Biswa Sharma The Reason For Migration In Congress Is Because Of Rahuls Campaign
Himanth Biswa Sarma: కాంగ్రెస్‌లో వలసలు మొదలుకావడానికి కారణం రాహుల్ న్యాయ్యాత్రే!
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్‌యాత్ర తర్వాతే అస్సాం కాంగ్రెస్‌లో వలసలు మొదలయ్యాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. కులగణన, మణిపూర్ హింస అంశాలపై సరైన అవగాహన లేకుండానే రాహుల్ మాట్లాడుతున్నారని తెలిపారు.
Himanth Biswa Sarma: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్‌యాత్ర తర్వాతే అస్సాం కాంగ్రెస్‌లో వలసలు మొదలయ్యాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. కులగణన, మణిపూర్ హింస అంశాలపై సరైన అవగాహన లేకుండానే రాహుల్ మాట్లాడుతున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత చాలామంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి చేరనున్నారని తెలిపారు. భారత్ జోడో న్యాయ్‌యాత్ర సందర్భంగా రాహుల్ రోడ్లపై నడుస్తూ రాజకీయ హడావుడి చేశారు. ఆయన తీరుతో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఇబ్బందిపడ్డారన్నారు.
రాహుల్ తీరు మాకు చాలా మేలు చేసిందన బిశ్వశర్మ అన్నారు. రాహుల్ గాంధీ పార్టీలో ఎవరితో కూడా మాట్లాడలేదు. వచ్చి ప్రజలను విసిగించి వెళ్లిపోయారన్నారు. రాహుల్ ప్రస్తావించిన కులాలు, మణిపుర్ అంశాలు అస్సాంలో ఏమాత్రం ప్రభావం చూపవని బిశ్వశర్మ అన్నారు. తమ రాష్ట్రంలో కుల వ్యవస్థ లేదని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఎవరైనా వచ్చి హఠాత్తుగా కులగణన అంటే ప్రజలు ఆమోదించరన్నారు. బిహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి హామీలు పనిచేస్తాయని చెప్పారు. విషయాలు తెలుసుకొనేందుకు ఎవరు చెప్పిందైనా వినాలని.. కానీ, రాహుల్‌లో సహనం తక్కువని పేర్కొన్నారు.