»Donald Trumps Campaign Said It Raised 420 Crores At A High Dollar Florida Fundraiser
US : బైడెన్, ట్రంప్ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాల సేకరణ
అమెరికా అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులుగా ఉన్న బైడెన్, ట్రంప్‌లు విరాళాల సేకరణలోనూ పోటీ పడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన బృందం ఒక్కరోజే ఏకంగా 420 కోట్లు సమీకరించి రికార్డు సృష్టించింది.
Joe Biden and Donald Trump are competing in the US presidential race
US election fundraising : అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు విరాళాల సేకరణలో బిజీగా మారాయి. ఈ విషయంలో ట్రంప్, బైడెన్‌కు సంబంధించిన బృందాలు పోటీ పోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్క రోజే 50.5 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 420 కోట్లు సమీకరించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ఫండ్ రైజింగ్ చేయడం ఇదే తొలిసారి అని తెలిపింది.
రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్, ట్రంప్ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్(Biden) గత నెలలో 750 కోట్లు సమీకరించారు. అదే ట్రంప్(Trump) ఒక్కరోజు చేపట్టిన ఒక కార్యక్రమంలోనే 420 కోట్లు సేకరించడం సంచలనంగా మారింది. ఒక కార్యక్రమంలో ఇంత మొత్తం సమీకరించడం ఇదే రికార్డని పేర్కొంది. నిజానికి ట్రంప్ ప్రచారం ప్రారంభించిన తొలినాళ్లలో విరాళాలిచ్చేందుకు దాతలెవరూ ముందుకు రాలేదు. పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ఇతరులకు మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది.
మార్చిలో 90 మిలియన్ డాలర్లు అంటే 750 కోట్లకు పైగా విరాళాలను సమీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్, టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి 192 మిలియన్ డాలర్ల నిధులు తమ చేతిలో ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపువేనని తెలిపింది. మార్చి 28న రెడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది.