NTR: హ్యాపీ బర్త్ డే బావ.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్!
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలను ఓ సారి చూస్తే.. వాళ్ల మధ్య మాంచి ఫ్రెండ్షిప్ ఉంది. వారిలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్రెండ్షిప్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ ట్వీట్ అని చెప్పాలి. ఇంతకీ ఎన్టీఆర్, బన్నీని ఎలా విష్ చేశాడు.
NTR: మామూలుగా అయితే.. స్టార్ హీరోల బర్త్ డేలకి సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఫ్యాన్స్ మొదలుకొని సినీ సెబ్రిటీల వరకు.. సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విష్ చేస్తుంటారు. కానీ.. ఇలా బర్త్ డే విష్ చేసుకునే హీరోల్లో.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ రూటే సపరేటు. అల్లు అర్జున్‌కి ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఎన్టీఆర్ కూడా ఒకడు. ఎలాంటి సందర్భం అయిన, ఎలాంటి విషయం అయినా సరే.. ఈ ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లడానికి అస్సలు వెనక్కి తగ్గరు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్.. ఇటు అల్లు ఫ్యాన్స్‌కు, అటు నందమూరి అభిమానులకు మాంచి కిక్ ఇస్తుంటుంది.
అందుకే.. బన్నీ, తారక్ బర్త్ డే వస్తే చాలు.. వీళ్ల ట్వీట్ కోసమే ఎదురు చూస్తుంటారు అభిమానులు. ఈ ఇద్దరు బావ బావ అంటూ.. సరదాగా విష్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ నుంచి బావ అనే ట్వీట్ పడిపోయింది. ఏప్రి 8న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న అల్లు అర్జున్‌కు.. ‘హ్యాపీ బర్త్‌డే బావ’ అంటూ ట్విట్టర్ వేదికగా బర్త్‌డే విషెష్ తెలిపాడు ఎన్టీఆర్. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ. ఈ సంవత్సరం మీకు సంతోషం, విజయాలతో నిండలాని కోరుకుంటున్నా’.. అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది టైగర్ ట్వీట్. ఇక.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ చెప్తూ అల్లు ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీ పేరు ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. ఏదేమైనా.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి.