WNP: విద్యతో పాటు విలువలు, సమాజ సేవతోనే నిజమైన ఇంజినీర్‌గా ఎదగాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. నర్సింగాయపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ‘మై భారత్’ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మానవతా విలువలను అలవర్చుకోవాలని తెలిపారు.