WNP: వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలో మానవ కంప్యూటర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శకుంతలా దేవి జయంతిని మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి వేదిక రాష్ట్ర ఛైర్మన్ రాజారాం ప్రకాశ్, కవిపండితుడు గిర్రాజా చారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణిత ఖగోళ జ్యోతి శాస్త్ర మేధావిగా శకుంతలాదేవి ప్రసిద్ధి చెందారని కొనియాడారు.