టిబెట్‌లో ఈ రోజు తెల్లవారుజామున 2:27 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిగస్టేకు 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. దీని ప్రభావం టిబెట్‌తో పాటు భారత్, నేపాల్(4.21 తీవ్రతతో ప్రకంపనలు), బంగ్లాదేశ్, చైనా, భూటాన్‌లోని పలు ప్రాంతాల్లో కనిపించింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.