»National Girl Child Day 2024 Know Whats Special Theme
National Girl Child Day 2024: నేడు జాతీయ బాలికా దినోత్సవం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు అని, వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి ప్రతీ సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటారు. కేవలం ఆరోగ్యం, ఆహారం గురించే కాకుండా, హక్కులు, ఆత్మరక్షణ గురించి అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
National Girl Child Day 2024 Know what's special theme?
National Girl Child Day 2024: సమాజంలో ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అన్ని హక్కులను పొందుతున్నారు. దీనికి కారణం జాతీయ బాలికా దినోత్సవాలు ప్రతి ఏటా జరిపి, ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పించడమే. అందుకే జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. విద్య, ఆరోగ్యం, ఆహారంతో పాటు వివక్షలేని సమాజం, వారి హక్కుల గురించి అవగాహన కల్పిస్తారు. ప్రతి ఆడపిల్లకు సమానత్వం, గౌరవం అనేవి వారి హక్కు అని చెప్పడం ద్వారా వారు జీవితంలో ఎదగడానికి తోడ్పడుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పఢావో అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తుంది.
జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మొదటి సారి నిర్విహించారు. ప్రతీ సంవత్సరం వార్షిక థీమ్‌ను అనుకొని దాన్ని నెరవేర్చే దిశగా ప్రయాణిస్తుంది. లింగ అసమానత, విద్య పరిమితులు, పాఠశాల డ్రాపౌట్లు, ఆరోగ్య సంరక్షణ, బాల్య వివాహాలు వంటి సమస్యలపై పోరాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 2024 థీమ్ ప్రకటించలేదు. 2019 సంవత్సరంలో ‘ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైటర్ టుమారో’, 2020లో ‘మై వాయిస్, అవర్ కామన్ ఫ్యూచర్’. 2021లో ‘డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్’ అనే థీమ్స్‌తో ముందుకెళ్లింది. ముఖ్యంగా ఈ దినోత్సవం లక్ష్యాలు మూడు.
1. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, ఆడ మగ తేడా లేకుండా అందరికి సమాన హక్కులు కల్పించాలి.
2. బాలికలకు సాధికారత, బాలికలను ఏ విషయంలో వివక్ష చూపరాదు. చదువు, జ్ఙానం సమానంగా అందించాలి.
3. బాలికల హక్కులను పరిరక్షించడం, బాల్య వివాహాలు, పోషకాహార లోపం, లింగ ఆధారిత హింస పెట్టరాదు. ముఖ్యంగా ఈ మూడింటిని దరికి రాకుండా చూస్తే అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో ముందుంటారు.