»Trump Supporter Who Asked Nikki Haley If She Would Marry Me
Nikki Haley: ప్రచారంలో నిక్కీ హీలికి ఎదురైన తుంటరి ప్రశ్న
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీకి ఒక వింత ప్రశ్న ఎదురైంది. ప్రచారంలో భాగంగా న్యూ హాంప్ షైర్లో వేదిక కింద ఉన్న ఒక ట్రంప్ మద్దతు దారు తనను పెళ్లి చేసుకుంటావా అని నిక్కీ హేలీని అడిగాడు. దాంతో అందరూ ఒక్క క్షణం షాక్ అయ్యారు.
Trump supporter who asked Nikki Haley if she would marry me
Nikki Haley: నిక్కీ హేలీ(Nikki Haley) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ(Republican Party) తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్. తాజాగా ఆమెకు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. న్యూ హాంప్ షైర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న నిక్కీపై ట్రంప్ మద్దతుదారు ఒకరు తుంటరి ప్రశ్న గుప్పించాడు. మిస్ నిక్కీ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగేశాడు. అక్కడ ఉన్న సముహాం అంతా ఒక్క సారిగా సైలెంట్ అయింది. తరువాత ముసిముసి నవ్వులు వినిపించాయి. సదరు వ్యక్తి మాటలకు నిక్కీ ఇచ్చిన సమాధానం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసంది. నాకు ఓటు వేస్తావా అని ఆమె ప్రశ్నించారు. లేదు నేనే ట్రంప్‌కు మాత్రమే ఓటు వేస్తాను అని హేలనగా అరిచాడు. దాంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని నిక్కీ హేలీ అరిచింది. ఆమే అరుపుతో ఆడిటోరియం అంతా కాసేపు నిశ్శబ్దం అవరించింది. తరువాత మరల తన ప్రసంగాన్ని కొనసాగించింది.
రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ కు గట్టి పోటీదారుగా నిక్కీ హేలీ ఉన్నారు. ఇటీవల అయోవా రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ కు 51 శాతం ఓట్లు రాగా… నిక్కీ హేలీకి 19 శాతం ఓట్లు వచ్చాయి. మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. భారతీయ ప్రొఫెసర్ అజిత్ సింగ్, రాజ్ కౌర్ రణధావా దంపతులు 1960లో అమెరికాకు వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. వీరికి 1972లో నిక్కీ హేలీ జన్మించారు. 1996లో ఆమె మైఖేల్ హేలీని వివాహం చేసుకున్నారు. సౌత్ కరోలినా గవర్నర్ గా గతంలో రెండు సార్లు పని చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో ఆమె అమెరికా రాయబారిగా బాధ్యతలను నిర్వర్తించారు.