»Soon Taapsee Pannu Is Going To Marry Her Boyfriend Mathias Bo
Taapsee pannu: ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన తాప్సీ
సినీ నటీ తాప్సీ పన్ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. తన ప్రియుడు మథియాస్ బోతో వచ్చే నెలలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Soon Taapsee pannu is going to marry her boyfriend Mathias Bo
Taapsee pannu: ఈ మధ్య హీరోయిన్లు వరుసగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్లో వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య, బాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వరుసలో మరో హీరోయిన్ రెడీ అయిపోయింది. ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తాప్సీ(Taapsee pannu ) తరువాత బాలీవుడ్లో బిజీ అయిపోయింది. తాజాగా తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బో ను పెళ్లాడబోతోంది అని తెలుస్తుంది. దాదాపు పది సంవత్సరాల నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తుంది. రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో మార్చి నెలలో వీరి వివాహం జరగనున్నట్టు కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
తాప్పీ ప్రియుడు మథియాస్(Mathias Bo) డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013లో తాప్సీ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు అభిప్రాయాలు కలవడంతో చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం దీనికిి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ మధ్య షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ చిత్రంలో నటించింది. థియేటర్లో అనుకున్నంతగా ఆడలేదు కానీ ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది.