»This Is Pawan Kalyans First Sequel Harihara Veeramallu Krish
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయనున్న ఫస్ట్ సీక్వెల్ ఇదే!
ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వలేదు. అలాగే ఒక్క సీక్వెల్ సినిమా కూడా చేయలేదు. కానీ తాజాగా పవర్ స్టార్ నటించనున్న ఫస్ట్ సీక్వెల్ ఫిక్స్ అయిపోయింది. ఎంతకీ ఏంటా సీక్వెల్ సినిమా.
This is Pawan Kalyan's first sequel! Harihara Veeramallu Krish
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన హరిహర వీరమల్లు రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. ఈ సినిమా మొదలు పెట్టి ఏండ్లు గడుస్తున్నాయి కానీ.. షూటింగ్ మాత్రం పూర్తి కావడం లేదు. పాలిటిక్స్ కారణంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలను పక్కన పెట్టేశారు పవన్. ఈ నేపథ్యంలో.. హరిహర వీరమల్లు ఆగిపోయింది.. క్రిష్ మరో సినిమా చేస్తున్నాడు.. అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చిన కూడా తిప్పి కొడుతునే ఉన్నారు మూవీ మేకర్స్. ఎట్టిపరిస్థితుల్లోను ఏపి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హరిహర వీరమల్లు కంప్లీట్ అవుతుందని చెబుతునే ఉన్నారు. లేటెస్ట్గా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం.
సినిమా ఆగిపోయింది అని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. ముందు నుంచి ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తునే ఉంది. కానీ.. అసలు సినిమానే కంప్లీట్ అవడం లేదు, దీనికి సీక్వెల్ సాధ్యమేనా? అనే సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏఎం రత్నం మాత్రం.. పవర్ స్టార్ అభిమానులకి మంచి సినిమా ఇచ్చే విషయంలో మేము కట్టుబడి ఉన్నాం. ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం.. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక.. ఇటీవల ఈ సినిమా స్పెషల్ ప్రోమో రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్.. శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా.. పవన్ చేస్తున్న ఫస్ట్ సీక్వెల్ సినిమాగా హరిహర వీరమల్లు నిలవనుంది.