»Jabardasth Faimas Wedding Love Interesting Comments On The Boyfriend
Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా పెళ్లి ముచ్చట.. ప్రియుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్.!
జబర్దస్త్ లేడీ కమేడీయన్ ఫైమా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించిన ఫైమా పెళ్లిపై కామెంట్స్ చేసింది. తనకు కాబోయే వరుడి ఇంటిపేరు చెప్పింది.
Jabardasth Faima's wedding love.. Interesting comments on the boyfriend.!
Jabardasth Faima: బుల్లితెర మీద మంచి పేరుతెచ్చుకున్న వారిలో లేడీ కమేడియన్ ఫైమా ఒకరు. పటాస్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా టీవీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ చిన్నది ఆ తరువాత బిగ్ బాస్ రియాలిటీ షోలో అలరించింది. తనదైన టైమింగ్, పంచులతో ప్రేక్షకుల మనసు దోచింది. మొదట తాను పటాస్‌లో స్టాండప్ కామెడీ చేసేది. ఆ సమయంలో మరో బుల్లితెర కమేడియన్ ప్రవీణ్‌తో పెయిర్‌గా కూడా చేసింది. ఆ తరువాత పటాస్ కార్యక్రమం నిలిచిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్‌లో చేసిన వారంతా జబర్దస్త్‌లోకి అడుగుపెట్టారు. అలా బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో ఫైమా చేసింది. ముందు అదిరే అభి టీమ్‌లో కొన్నాళ్లు చేసింది. అతను కూడా మానేయ్యడంతో బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో కంటిన్యూ అవుతుంది.
అదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ అయింది. అందులో కూడా ఫైమా నవ్వులు పూయించింది. అక్కడే మళ్లీ ప్రవీణ్‌తో కొన్ని స్కిట్స్ చేసింది. అలా వారిద్దరి పెయిర్ బాగుండడంతో లవ్ ట్రాక్ పెట్టారు. ఇదే నిజమని కొంతమంది నమ్మారు కూడా. అదే సమయంలో ఫైమా టైమింగ్, కామెడీ స్టైల్ నచ్చి బిగ్ బాస్ యాజమాన్యం కాల్ చేసింది. దాంతో రియాలిటీ షోలో అడుగుపెట్టింది. తనదైన పంచులతో హౌస్‌లో ఆకట్టుకుంది. టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచింది. ఇక అదే సమయంలో తన పెళ్లిపై కొన్ని వార్తలు వచ్చాయి. ప్రవీణ్‌నే పెళ్లి చేసుకుంటుంది అనే గాసిప్స్ వచ్చాయి. ఆ సమయంలో అందరికీ షాక్ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోయేది ప్రవీణ్ నాయక్ అంటూ తన భాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. ఇక తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానంగా త్వరలేనే అని చెప్పింది. అంతే కాకుండా తాను చేసుకోబోయే అతని ఇంటిపేరు బాదవత్ అని చెప్పుకొచ్చింది. దాంతో ఫైమా వెడ్స్ బాదవత్ ప్రవీణ్ నాయక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.