»Pressure On Samantha To Love Who Is A Great Politician
Samantha: ప్రేమించాలంటూ సమంత పై ఒత్తిడి? ఎవరా బడా పొలిటీషియన్?
ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత. అయితే.. సమంత ప్రేమాయణానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ సమంత పై ఒత్తిడి చేసిన రాజకీయ నేత కుమారుడు ఎవరు?
Pressure on Samantha to love? Who is a great politician?
Samantha: స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాస్త బ్రేక్ తీసుకుంది సామ్. గత ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో పోరాటం చేస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. త్వరలోనే తిరిగి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం సమంత పాడ్ కాస్ట్లో గతంలో తన పరిస్థితులని గుర్తు చేసుకుంటోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో నా శక్తి సగానికి పడిపోయింది.. ఓసారి ఏకంగా అక్కడే కుప్పకూలిపోయానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. సమంత ప్రేమ, పెళ్లి వ్యవహారం అందరికీ తెలిసిందే. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్.. కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అయితే.. చైతన్యతో లవ్ మ్యాటర్ మాత్రమే చాలా మందికి తెలుసు.
కానీ గతంలోనే సామ్‌కు లవ్ స్టోరీస్ ఉన్నాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌తో అమ్మడి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుబోతున్నట్టుగా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమోగానీ.. సిద్ధు, సామ్ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాతే చైతన్య ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. కానీ అంతకంటే ముందు సమంతను ప్రేమించాలంటూ ఓ రాజకీయ నేత కుమారుడు తెగ ఒత్తి చేశాడట. సమంతను ఓ పొలిటీషియన్ కుమారుడు చాలా ఘాడంగా ప్రేమించాడట. సమంతను తనని ప్రేమించాలని తెగ ఒత్తిడి చేశాడట. దీంతో.. సామ్ అతని టార్చర్ భరించలేక కొన్ని రోజులు ఆ రాష్ట్రాన్నే వదిలేసిందట. అంటే.. సామ్ అతన్ని తిరిగి ప్రేమించలేదన్న మాట. అయితే ఆ బడా రాజకీయ నేత ఎవరు? అతని కొడుకు ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అన్నట్టు.. ప్రస్తుతం సమంత తన ఫ్రెండ్ ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉందని టాక్ ఉంది.