»Did Siddharth And Aditi Give A Big Shock Not Married
Siddharth: బిగ్ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్, అదితి? పెళ్లి కాదట?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, హైదరాబాదీ హీరోయిన్ అదితీ రావు హైదరీ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ పెళ్లికి బిగ్ షాక్ ఇచ్చే ట్విస్ట్ ఇచ్చారు సిద్దు, అదితీ. ఇది పెళ్లి కాదట.
Did Siddharth and Aditi give a big shock? Not married?
Siddharth: సిద్ధార్త్, అదితి రావు హైదరీ ఇద్దరు కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సందర్భాలలో కెమెరా కంటపడ్డారు. కానీ ఎప్పుడు కూడా ఓపెన్ అవలేదు. అయితే.. నిన్నటికి నిన్న ఈ ఇద్దరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. వీరి వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్లో జరిగిందని.. అక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆలయ నిర్వహకులకు చెప్పి.. వారి నుంచి పర్మిషన్ తీసుకొని.. తమిళనాడు పూజారులతో వివాహ తంతు జరిగిందని అన్నారు. కానీ లేటెస్ట్గా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అదితి. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నది నిజమేనని చెబుతూ.. ఓ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసింది.
తామిద్దరం పెళ్లి చేసుకోలేదు.. ‘జస్ట్ ఎంగేజ్జ్’ అంటూ చేతికున్న ఎంగేజ్మెంట్ రింగులను చూపిస్తూ ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది. తనకి సిద్ధార్థ్ ఎస్ చెప్పాడు అన్నట్టుగా సెలవిచ్చింది. దీంతో వీరిద్దరికీ వివాహం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు పడినట్లు అయింది. మొత్తంగా.. ఈ ఇద్దరు చేసుకుంది పెళ్లి కాదు.. ఎంగేజ్మెంట్ అనే క్లారిటీ మాత్రం వచ్చేసింది. కానీ నిజంగానే పెళ్లైనట్టుగా సోషల్ మీడియాలో జరిగిన హడావిడి మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. ఏదేమైనా.. పెళ్లంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నామని ట్విస్ట్ ఇచ్చిన ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు అభిమానులు.