Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు ఇది మరో పెద్ద షాక్?
నిజమే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ న్యూస్ మరో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే ఓ బడా ప్రాజెక్ట్ ఆగిపోగా.. ఇప్పుడు మరో సూపర్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అంటున్నారు. ఇంతకీ ఈ క్రేజీ కాంబోలో సినిమా ఉంటుందా? లేదా?
Vijay Deverakonda: ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నది ఒక్కటే. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా సుకుమార్ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.. అంటూ రచ్చ చేస్తున్నారు. దీంతో.. పుష్ప2 తర్వాత సుకుమార్ చేసేది చరణ్ సినిమానే అని అంతా ఫిక్స్ అయిపోయారు. సుకుమార్ కూడా గతంలో రంగస్థలం తర్వాత మరోసారి చరణ్‌తో సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఇక రాజమౌళి ట్రిపుల్ ఆర్ సమయంలో.. ఎప్పుడో సుకుమార్, చరణ్ ప్రాజెక్ట్ ఇంట్రో షూట్ కూడా అయిపోయిందని రివీల్ చేశాడు. దీంతో నెక్స్ట్ చరణ్, సుకుమార్ కాంబో ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు. కానీ.. చరణ్ కంటే ముందే సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది. గతంలోనే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. మధ్యలో లైగర్ ఫ్లాప్ అవడంతో రౌడీ, సుక్కు కాంబో లేదని అన్నారు.
కానీ ఖచ్చితంగా మేము ఈ సినిమా చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ఇద్దరు. కానీ మళ్లీ మధ్యలో ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఇప్పుడు చరణ్‌తో సుకుమార్ సినిమా ప్రకటన అనేసరికి.. రౌడీకి సుకుమార్ హ్యాండ్ ఇచ్చినట్టేనా? అనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే.. మార్చి 27న రౌడీకి బిగ్ షాక్ తప్పదని అంటున్నారు. ఎందుకంటే.. లైగర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ చూశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా దెబ్బకు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు సుకుమార్ ప్రాజెక్ట్ కూడా దాదాపుగా ఔట్ అయినట్టేనని అంటున్నారు. పైగా సుక్కు పుష్ప3కి కూడా ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి.. ఇక విజయ్‌తో సినిమా కష్టమే.. అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.