Akhil: ‘అఖిల్’ ఈసారి తగ్గేదేలే.. ఒకటి కాదు, రెండు?
గత కొంత కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అఖిల్.. ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. కొడితే మామూలు హిట్ కొట్టకూడదు.. పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వచ్చేలా కొట్టాలనుకుంటున్నాడు. అందుకే.. ఒకటి కాదు రెండు ప్లాన్ చేస్తున్నాడట.
Akhil: ఇప్పటి వరకు కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మాత్రమే ఓ మోస్తారు హిట్ చూశాడు. భారీ అంచనాలతో చివరగా చేసిన ‘ఏజెంట్’ సినిమా మాత్రం అఖిల్ కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దర్శకుడు సురేందర్ రెడ్డి పై చాలా నమ్మకంతో ఏజెంట్ కోసం చాలా రిస్క్ చేశాడు అఖిల్. కానీ ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ అఖిల్‌ను కోలుకోకుండా చేసింది. ఎంతలా అంటే.. ఇప్పటివరకు మరో సినిమాని అనౌన్స్ కూడా చేయలేదు. కానీ ఈసారి కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతానికి అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ సోషియో ఫాంటసీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ, గ్రౌండ్ వర్క్ గట్టిగా మాత్రం జరుగుతోంది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయయం కాబోతున్నాడు. అఖిల్ కెరీర్లోనే ఈ సినిమా హెయెస్ట్ బడ్జెట్‌తో రూపొందనుంది.
దీని కోసం అఖిల్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. దిట్టంగా జుట్టు పెంచేసి, గడ్డం పెంచేసి ఒక బీస్ట్ లుక్‌లో రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాను ఒకటి కాదు రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య సీక్వెల్ సినిమాలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లో ఉన్న కల్కికి కూడా పార్ట్ 2 రానుంది. ఇప్పటికే పుష్ప2తో పాటు సలార్ 2 కూడా లైన్లో ఉంది. దీంతో.. అఖిల్ కూడా రెండు భాగాలుగా కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే.. ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే సెకండ్ పార్ట్ ఉంటుంది. మరి అఖిల్ మొదటి భాగంతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.