Kalki 2898AD: Kalki@625 Crores.. Fifth Day All Time Record!
Kalki 2898AD: జూన్ 27న రిలీజ్ అయిన కల్కి 2898ఏడి సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. ఫస్ట్ డే 191.5 కోట్ల గ్రాస్ రాబట్టిన కల్కి.. రెండో రోజు 107 కోట్ల వసూళ్లను సాధించింది. మూడో రోజు 116.5 కోట్లు, నాలుగో రోజైన ఆదివారం వీకెండ్ కావడంతో 140 కోట్లు రాబట్టింది. దీంతో ఫస్ట్ వీకెండ్లో 555 కోట్ల కొల్లగొట్టింది. అయితే.. వీకెండ్ అయిపోయింది కాబట్టి.. మండే నుంచి కల్కికి బాక్సాఫీస్ దగ్గర అసలు పరీక్ష స్టార్ట్ అయింది. జనరల్‌గా చెప్పాలంటే.. ఏ సినిమా తీసుకున్న సరే.. సాలిడ్ హిట్ టాక్ వచ్చినప్పటికీ.. మండే నాటికి వసూళ్లు భారీగా తగ్గుతాయి. కల్కి విషయంలోను అదే జరుగుతుందని అనుకున్నారు. కానీ సండే లేదు, మండే లేదు అన్నట్టుగా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తోంది కల్కి. దీంతో.. ఫస్ట్ మండే ఆల్ టైం రికార్డు వసూళ్లు రాబట్టింది.
ఇది కూడా చూడండి: BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ రీఛార్జ్ ప్లాన్.. రోజుకి 2జీబీ డేటా!
వరుసగా నాలుగు రోజుల పాటు 100 కోట్లకి పైగా గ్రాస్‌ని అందుకున్న కల్కి.. మండే నాడు 70 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఫస్ట్ మండే పరంగానే కాదు.. ఐదో రోజుల వసూళ్లలలో ఇదే అత్యధికం అని తెలుస్తుంది. మొత్తంగా ఐదు రోజుల్లో 625 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది కల్కి. ఈ లెక్కన ఈజీగా 1000 కోట్ల క్లబ్లో ఎంటర్ కానుందనే చెప్పాలి. ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ 600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి 2898 ఏడీ సినిమాను నిర్మించగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, కీలక పాత్రలు చేయగా.. దిశా పటాని, శోభన, అన్నా బెన్, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్, అవసరాల శ్రీనివాస్, ఫరియా అబ్దుల్లాలు గెస్ట్ రోల్స్ చేశారు.
ఇది కూడా చూడండి: Improve Concentration: ఏకాగ్రతను పెంచే చిట్కాలు!

