»Improve Concentration Tips To Increase Concentration
Improve Concentration: ఏకాగ్రతను పెంచే చిట్కాలు!
ప్రస్తుత రోజుల్లో చాలామంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయి ఒత్తిడి, ఆందోళన వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
Improve Concentration: Tips to increase concentration!
Improve Concentration: ప్రతి మనిషికి ఏకాగ్రత ముఖ్యం. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలని అంటారు. చదువుతున్న విద్యార్థులు లేదా ఉద్యోగులు అయిన ఏకాగ్రతతో పనిచేయాలి. ఏకాగ్రతతో పనిచేస్తే ఎలాంటి పని అయిన మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయి ఒత్తిడి, ఆందోళన వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
చాలామంది ఒక దగ్గర ఉంటూ వేరే దగ్గర ఆలోచిస్తూ ఉంటారు. చదువుతున్న, వర్క్ చేస్తున్న వేరే వాళ్ల గురించి ఆలోచించడం చేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని ఆ సమస్యలకు చెక్ పెట్టండి. ఏ పనిచేసినా ఏకాగ్రతతో కేవలం అదే పని మాత్రమే చేయండి. అలాగే చేస్తున్న పనిలో అప్పుడప్పుడు విరామాలు తీసుకోవాలి. స్వల్ప విరామాల వల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది. పని మధ్యలో నడవడం, పాటలు వినడం వంటి స్వల్ప విరామాలు తీసుకోవాలి.
ఏకాగ్రతను పెంచే వాటిలో ముఖ్యమైనవి శ్వాస వ్యాయామాలు. ఇవి ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. వీటితో పాటు యోగా, మెడిటేషన్ కూడా చాలా ముఖ్యం. రోజుకి కనీసం 10 నిమిషాల పాటు చేసినా ఫలితం ఉంటుంది. అలాగే ఏ పని చేసిన పాజిటివ్ మైండ్‌తో చేయాలి. అలా చేయడం వల్ల పనిలో ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది. నెగిటివ్ మైండ్‌తో చేయడం వల్ల అవుతుందో లేదో అనే భయం వల్ల ఏకాగ్రత కోల్పోయి ఆందోళనకి గురవుతారు.