జూన్ 27న రిలీజ్ అయిన కల్కి 2898ఏడి సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్తో పాటు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దీంతో.. ఈ వారంలో రిలీజ్ కావాల్సిన హిందీ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
Kalki: ప్రస్తుతం కల్కి క్రేజ్ ఎలా ఉందంటే.. బాలీవుడ్ సినిమా సైతం వాయిదా పడేంతలా ఉంది. బాలీవుడ్లో కల్కికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హిందీలో ఫస్ట్ డే 22.50 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు 23.25 కోట్లు, మూడో రోజు 26.25 కోట్లు, నాలుగో రోజు 40.15 కోట్లతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది కల్కి. ఇక మండే రోజు కూడా 16.50 కోట్లు రాబట్టి.. 130 కోట్లకు చేరువైంది. అంతేకాదు.. ఫస్ట్ వీకెండ్లో 555 కోట్లు రాబట్టిన కల్కి.. షారుక్‌ఖాన్ ‘జవాన్’ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. ఫస్ట్ వీకెండ్లో 520 కోట్లు రాబట్టింది జవాన్. దీంతో.. జవాన్ పేరుతో ఉన్న రికార్డు ప్రభాస్ దెబ్బకు బద్దలైంది. ఇక.. కల్కి సినిమాకు పోటీగా మరో మూవీ థియేటర్లోకి వచ్చే సాహసం చేయడం లేదు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత రిలీజ్ కావాల్సిన ఓ హిందీ సినిమా పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తోంది.
హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ టబు నటించిన చిత్రం ‘ఔరోన్ మెయిన్ కహాన్ దం తా’ అనే సినిమా ఈ వారంలో.. జూలై 5న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కల్కి దెబ్బకు వచ్చే వారానికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హిందీలోనే కాదు.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కొత్త సినిమాలు రావడం లేదు. అయితే.. జూలై 12న మాత్రం శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ ఇండియన్ 2 థియేటర్లోకి రాబోతోంది. అప్పటి వరకు కల్కికి బాక్సాఫీస్‌ను రాసిచ్చేశారు. కాబట్టి.. కల్కి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో రెండో వెయ్యి కోట్ల సినిమాగా నిలవడానికి దూసుకుపోతోంది. మరి కల్కి లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.