TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. డిజిటల్ ఎక్విప్మెంట్, పాస్ వర్డ్ ఇవ్వకుండా కేసు విచారణకు ఏ మాత్రం సహకరించలేదని న్యాయస్థానానికి సిట్ అధికారులు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్పై రేపు కూడా విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.