AKP: పాయకరావుపేట పీహెచ్సీకి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరుపక్కల ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన షాపులను తొలగించాలని పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. షాపులు రోడ్డుపైకి ఉండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. అత్యవసర చికిత్సకు రోగులను తీసుకువచ్చే వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. షాపులను వేరే ప్రాంతాలకు తరలించాలన్నారు.