కర్ణాటక సీఎం పదవీకాలంపై సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై మండిపడ్డారు. పదవి వ్యామోహంతోనే నాయకత్వ మార్పు విషయంలో డిప్యూటీ సీఎం గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని పాచికలు పారినా అవి చెల్లవని పేర్కొన్నారు.