బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ-2. ఇటీవల వాయిదా పడిన సినిమాను ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్పింది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా అడ్డంకులన్నీ తొలగడంతో విడుదలకు సిద్ధమైంది.