PPM: జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ బి. శ్రీనాథుడు ఆదేశాలు మేరకు కొమరాడ మండలం రెబ్బ గ్రామంలో నాటుసార స్థావరాలు పై ఎక్స్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 డ్రమ్ములలో నిల్వచేసిన 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారుచేస్తున్న తాడంగి చిన్నయపై కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.