KDP: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం-2025 పోటీల విజేతలకు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం బహుమతులు అందజేశారు. డీపీవోలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు, పోలీసు కుటుంబాలు, సిబ్బంది కలిపి 18 మందికి నగదు పురస్కారాలు అందించారు. విజేతలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.