Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా రష్మిక దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. అనిమల్ సినిమాతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. దీంతో అమ్మడి క్రేజ్ ఆమంతం పెరిగిపోయింది. అనిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఏకంగా ఒకేసారి మూడు సినిమాలకు సైన్ చేసినట్టుగా సమాచారం. అఫిషీయల్‌గా ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప2తో పాటు.. రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి లేడి ఓరియేంట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటు.. అదిరిపోయే రిప్లేలు ఇస్తుంటుంది.
తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో పాటుగా సినిమాల విశేషాలను కూడా పంచుకుంటుంది. ఇక సినిమా కోసం రష్మిక జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటుంది. మామూలుగా హీరోయిన్లు ఫిట్ నెస్ మెంటైన్ చేయాలంటే.. గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేయాల్సిందే. లేటెస్ట్గా రష్మిక జిమ్ వర్కౌట్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో రష్మిక తలకిందులుగా వర్కౌట్స్ చేస్తోంది. ఇకపోతే.. సినిమాలు, సోషల్ మీడియా, వర్కౌట్స్ సంగతి పక్కన పెడితే.. రష్మిక తరచుగా ట్రెండ్ విషయం ఏదైనా ఉందా? అంటే, విజయ్ దేవరకొండ విషయంలోనే అని చెప్పాలి. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టుగా పుకార్లు వస్తునే ఉంటాయి. కానీ రష్మిక, రౌడీ మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్ అని కొట్టిపారేస్తుంటారు. ఏదేమైనా.. రష్మిక క్రేజ్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి.