»Rakul Preet Singh Spoke About Her Husband For The First Time
Rakul Preet Singh: మొదటిసారి తన భర్త గురించి చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీ గురంచి ప్రస్తావించింది. వాళ్ల అత్తవాళ్లది చిన్న మనస్థత్వం కాదని చాలా బ్రాడ్‌గా ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చింది. తాను వేసుకుంటున్న డ్రెస్‌లపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Rakul Preet Singh spoke about her husband for the first time
Rakul Preet Singh: అందాల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఇటీవల బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా లాక్మీ ఫ్యాషన్ వీక్ 2024లో మెరిసింది రకుల్. షోస్టాపర్‌గా ర్యాంప్‌ను అలంకరించిన అనంతరం ఓ మీడయాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ఫిబ్రవరిలో గోవాలో జాకీ భగ్నానితో మూడుముళ్ల బంధంతో ఒకటైన తరువాత తను ధరించే దుస్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ల ఆలోచన ఎలా ఉంటుంది అనే ప్రశ్నవేశారు ఇంటర్వ్యూయర్. దానికి రకుల్ సమాధానం చెబుతూ.. తన భర్తవాల్ల కుటుంబం చాలా బ్రాడ్ మైండెడ్తో ఉంటారు అని చెప్పుకొచ్చింది.
తాను జాకీ భగ్నానీ పెళ్లి చేసుకున్నందుకు చాలా అదృష్టమంతురాలిని అని అన్నారు. మాములుగానే భారతీయ సంప్రదాయాల్లో పెళ్లి తరువాత స్త్రీ అభిరుచులు మారుతుంటాయి. తన కట్టుబొట్టులో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అది అందరి జీవితాల్లో చాలా సహజం అని రకుల్ పేర్కొన్నారు. కానీ రోజులు మారాయి ఆఫీస్‌లకు వెళ్లే వారు, ఉద్యోగాలు చేసే వారు తమ సౌకర్యం కోసం వారికి నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారు. అయితే తాను మోడలింగ్ రంగంలో ఉంది కాబట్టి కచ్చితంగా కలర్ ఫుల్ దుస్తులు, ఆకర్షణియమైన డ్రెసులు ధరించాలి, ఆ విషయంలో తన అత్తమామలు చాలా బ్రాడ్ మైండెడ్ అని చెప్పారు. తన హస్బెండ్ కూడా క్రియేటీవ్ ఫీల్డ్‌లోనే ఉన్నాడు కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు అని తెలిపారు.