»Rakul Preet Singhs Younger Brothers Drugs Case Revealed By The Police
Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో నార్సింగ్ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 20 మంది పట్టుబడ్డారు అని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
Rakul Preet Singh's younger brother's drugs case revealed by the police
Drugs case: హైదరాబాద్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో కీలక విషయాలను వెల్లడించారు నార్సింగ్ పోలీసులు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఈ కేసులో డ్రగ్స్‌తో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అనంతరం చేసిన టెస్టులో పాజిటీవ్ కూడా వచ్చింది. దీంతో ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించిన కీలకమైన విషయాలను నార్సింగ్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో ఏడుగురు పెడ్లర్లు అంటే అమ్మకాలు జరిపేవారు. 13 మంది 13 మంది వినియోగదారులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో మొదట ఏ6గా అమన్ ప్రీత్ సింగ్‌ను పేర్కొన్నారు ఇప్పుడు అతన్ని ఏ10గా చెబుతున్నారు.
రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం డ్రగ్స్ నైజీరియా నుంచి ఢిల్లీ, హైదరాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళుతుంది. వీటిని ఎబుకా, ఆనౌహ బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్ అనే వ్యక్తులు సరఫరా చేస్తున్నారు. అందులో కేవలం తెలుగు రాష్ట్రాలకు వరుణ్, గౌతమ్, షరీఫ్‌లు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఈ పెడ్లర్లకు కావాల్సిన డబ్బును నైజీరియన్లు సమకూరుస్తూ వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఎబుకా సుజి కింగ్‌పిన్ కీలకమైన వ్యక్తిగా గుర్తించారు. ఇది ఒక చైన్ సిస్టమ్ అని ఎబుకా నుంచి ఆనౌహ బ్లెస్సింగ్ అనే మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చిందని గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా హైదరాబాద్, రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాకు సరఫరా చేసినట్లు రిపోర్టులో తెలిపారు. దీనికి గాను గౌతమ్‌కు రూ. 10 లక్షలు కమిషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ డబ్బును బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా చెల్లించినట్లు పోలీసులు చెప్పారు.