హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి హైదరిల వివాహం అత్యంత రహస్యంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు ఈ రోజు ఉదయం పెళ్లి చేసుకున్నారు.
Siddharth: లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాలకు కూడా కోలీవుడ్‌తో పోటీగా టాలీవుడ్లో మార్కెట్ ఉంటుంది. బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మనుసు దోచుకున్న ఈ హీరో చాలా మంది హీరోయిన్ల మనసుదోచినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇవన్ని పక్కన పెడితే.. తాజాగా సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా లవ్‌లో ఉన్న అధితి హైదరితో ఆయన వివాహం జరిగిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ సుందరి అప్పటికే చాలా కాలంగా తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఆ తరువాత అంతారిక్షం, వీ, మహాసముద్రం సినిమాలో నటించింది. అయితే మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే హీరో సిద్ధార్థ్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్లో ఉన్నారు. ఇరువురి అభిప్రాయాలు కలువడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు. అప్పటికే వీరిద్దరు తమ తమ వివాహ బంధం నుంచి సపరేట్ అయిన వారే కావడంతో, వీరి మధ్య స్నేహం, ప్రేమ బలపడింది. దాంతో ఈ రోజు ఉదయం వనపర్తి జిల్లాల్లోని శ్రీరంగపురం ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.