»Woman Seeks Divorce From Husband Over Tightening Jar Lids On Purpose
Divorce: డబ్బాల మూతలు గట్టిగా పెడుతున్నాడని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య
ప్రస్తుతం పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చగానే ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలకే క్షణికావేశంలో విడాకులు తీసుకుని కనిపెంచిన వాళ్లకు తీవ్ర ఆవేదన మిగిల్చుతున్నారు.
Divorce: ప్రస్తుతం పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చగానే ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలకే క్షణికావేశంలో విడాకులు తీసుకుని కనిపెంచిన వాళ్లకు తీవ్ర ఆవేదన మిగిల్చుతున్నారు. తాజాగా ఓ మహిళ తన భర్త డబ్బాలకు మూతలు గట్టిగా పెడుతన్నాడన్న కారణంతో ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసింది. ఇది విన్నవారంతా షాక్ అవుతున్నారు. అదేంటి.. ఇలాంటి చిన్న కారణానికి కూడా విడాకులు తీసుకుంటారా ? అని అవాక్కవుతున్నారు. నెట్టింట రెడ్డిట్ లో పోస్ట్ చేసిన ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. పేరు తెలియని ఓ యువతి రెడ్డిట్‌లో తన భర్తతో తాను పడుతున్న ఇబ్బందుల గురించి రాసుకొచ్చింది. తన ఇంట్లో ఆవకాయ పచ్చళ్ల మూతలు, ఇతర డబ్బాల మూతలను తన భర్త బిగుతుగా పెడుతున్నాడని, వాటిని తెరవడానికి తాను చాలా సార్లు ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకొచ్చింది.
మూత గట్టిగా పెట్టడం వల్ల డబ్బాల్లోని ఆహారం ఫ్రెష్‌గా ఉంటుందని పెళ్లి అయిన కొత్తలో ఆమె భర్త చెప్పాడట. మూత గట్టిగా పెట్టినా, వదులుగా పెట్టినా అందులోని ఆహారం ఎలాగూ పాడవుతుంది. అది ఎలాగున్నా తనకు ఇబ్బంది లేదని, మూత గట్టిగా పెట్టడం వల్ల తాను కోరుకున్న సమయంలో ఆహారం తినలేకపోతున్నానని, కొన్ని సార్లు పొరుగింటి వారి సాయంతో డబ్బాల మూతలు తీసుకోవాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఐదేళ్ల తరబడి ఇలా బిగించిన డబ్బాల మూతలు తెరవలేక నానావస్థలు పడుతున్నట్లు బాధను వ్యక్తం చేసింది. పైగా తన భర్త ఉద్ధేశ్యపూర్వకంగానే ఇలా వాటి మూతలు గట్టిగా పెడుతున్నట్లు గుర్తించిందట. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయిందట.
భర్త చర్యలతో విసిగిపోయిన ఆమె అప్పటికే డివోర్స్ కు దాఖలు చేసింది. వారి పెళ్లిలో ఉన్న ఏకైక సమస్య డబ్బాల మూతలు బిగుతుగా పెట్టడమేనట. అయితే తాను ఇదంతా కావాలని చేస్తున్నట్లు భార్య ముందు ఆమె భర్త అంగీకరించకపోవంతో తన కోపం నషాలానికి అంటింది. ప్రతిరోజూ డబ్బాల మూతలు తీయడానికి కష్టపడాల్సి వస్తుందని, ఈ విషయంపై చాలాసార్లు గొడవపడ్డామని, ఇక లాభంలేకనే తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కోర్టులో సదరు మహిళ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.