MNCL: జన్నారం మండలంలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాల తరలింపు గడువులోగా పూర్తవుతుందో, లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం బస్తాల తరలింపునకు ప్రభుత్వం జూన్ 5 చివరి తేదీగా నిర్ణయించింది. మండలంలో గోదాములు ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. దీంతో అధికారులు జన్నారంలో ఉన్న దాన్యం బస్తాలను ట్యాగ్ ఇచ్చి పెద్దపల్లికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.