MBNR: గండీడ్ మండలంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ప్రీ-ప్రైమరీ విద్య అమలుకు ఎంపిక చేసినట్లు ఎంఈవో జనార్దన్ తెలిపారు. పెద్ద వార్వాల్, చిన్న వార్వాల్, గండీడ్, పగిడ్యాల, లింగాయపల్లి పాఠశాలలు ఇందులో ఉన్నాయి. చిన్నారులకు ఆటలతో కూడిన అభ్యాసం, భాషా నైపుణ్యాలతో నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు.