Vijay Devarakonda: లవ్ చేశా.. కానీ బ్రేకప్ అయ్యింది
ఫ్యామిలీ స్టార్ ప్రమెషన్స్లో భాగంగా విజయ్ను ఓ వ్యక్తి ప్రశ్న అడిగారు. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్షిప్లో ఉండవచ్చా? అడగ్గా.. దీనికి విజయ్ సమాధానం ఇలా ఇచ్చాడు.
Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమెషన్స్లో బిజీగా ఉన్నారు. వీటిలో భాగంగా విజయ్ను ఓ వ్యక్తి ప్రశ్న అడిగారు. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్షిప్లో ఉండవచ్చా? అని అడిగారు. దీనికి విజయ్ ఇలా సమాధానమిచ్చారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రిలేషన్షిప్లో ఉంటారు. నా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ల భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ బంధం ముందుకు సాగలేదు.
బ్రేకప్ తర్వాత కొన్నేళ్లపాటు బాధపడతారు. ఆ తర్వాత మరొకరిని కలుస్తారు. వాళ్లతో ప్రేమలో పడతారు. వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం ఒకే. కానీ ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటం కరెక్ట్ కాదు. నేను అది ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయే సర్వస్వం. గతంలో ఒకరిని ప్రేమించా కానీ అది సక్సెస్ కాలేదని విజయ్ సమాధానమిచ్చారు.