భారీ ఓపెనింగ్స్ తో కల్కి 2898 ఏడి గ్రాండ్ గా మొదలయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ డీల్ చేసిన విధానం పిల్లా పెద్దా తేడా లేకుండా అందరినీ మెప్పిస్తోంది. ఊహించని క్యామియోలు ఎన్నో పెట్టడంతో ఆయా అభిమానులు తెరమీద చూసి షాక్ అవుతున్నారు. అయితే.. కొన్ని పాత్రల క్యామియోలు చూసి.. అసలు అవసరమా అనిపించేలా ఉండటం గమనార్హం.
Kalki 2898 AD: Are all these unnecessary in Kalki..?
Kalki 2898 AD: కల్కి 2898 AD మొదటి నుంచి అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం భారీ క్యాస్టింగ్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్‌తో పాటు ప్రభాస్, దీపికా పదుకొనే వంటి 2 అతిపెద్ద సమకాలీన తారలు నటించడంతో అందరినీ ఆకర్సించింది. దీనితో పాటు, నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో చాలా మంది నటీనటులను చిన్న పాత్రలలో చేర్చడానికి ఎంచుకున్నాడు. ఈ అతిధి పాత్రల్లో చాలా వరకు నాగ్ అశ్విన్ గత సినిమాల్లో నటించిన వారినే ఎంచుకున్ానడు. అయితే…. చాలా అతిధి పాత్రలు ఉన్నాయి కానీ ఏమీ ప్రభావం చూపలేదు. కంటెంట్‌ని పక్కనపెట్టి అతిధి పాత్రలు సినిమాకు ప్రతికూలంగా ఉన్నాయని ప్రేక్షకులు కూడా భావించారు.
మృణాల్ ఠాకూర్, అనుదీప్, ఫరియా అబ్దుల్లా, RGV, రాజమౌళి అతిధి పాత్రలు అనవసరం . సినిమా కంటెంట్‌తో సంబంధం లేదు. దిశా పటానీ, దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ పాత్రలు కథతో సంబంధం ఉన్న పాత్రలే., కానీ అవసరమైన ప్రభావాన్ని సృష్టించలేకపోయాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అతిధి పాత్ర భారీ విమర్శలు, ట్రోల్‌లను ఎదుర్కొంది. అతని లుక్ , డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు సంతోషించలేదు. అతను పౌరాణిక పాత్రలకు మంచిగా సూట్ అవ్వలేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.