»Viral Post The Wife Gave A Condition That She Will Quit Her Job If She Gives A Share In The Company
Viral Post: కంపెనీలో వాటా ఇస్తే ఉద్యోగం మానేస్తానని కండీషన్ పెట్టిన భార్య
ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కూడా కొందరు పిల్లల కోసం వదిలేస్తున్నారు. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలని అన్ని వదిలేసి పిల్లల కోసం బ్రతుకుతున్నారు. అయితే ఓ మహిళకు తన భర్త ఉద్యోగాన్ని వీడి ఇంట్లో పిల్లలను చూసుకోమన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకున్న నిర్ణయం నెట్టింట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Viral Post: The wife gave a condition that she will quit her job if she gives a share in the company
Viral Post: ప్రస్తుతం చాలా మంది మహిళలు కష్టపడి పనిచేస్తూ వాళ్ల ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కూడా కొందరు పిల్లల కోసం వదిలేస్తున్నారు. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలని అన్ని వదిలేసి పిల్లల కోసం బ్రతుకుతున్నారు. అయితే ఓ మహిళకు తన భర్త ఉద్యోగాన్ని వీడి ఇంట్లో పిల్లలను చూసుకోమన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకున్న నిర్ణయం నెట్టింట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆ మహిళలకు వివాహం జరిగి ఆరేళ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మళ్లీ ఆమె గర్భిణి కూడా. పిల్లలను చూసుకోవడానికి ఆమెను ఉద్యోగం మానేయమని భర్త చెప్పారు. ఆ మాటతో ఆమె మానసికంగా కుంగిపోయారు. ఎంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగం.. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయిన భవిష్యత్తులో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకుంటే ఎలాంటి ఆధారం లేదని ఆమె బాధపడ్డారు. ఈ విషయంలో బాగా ఆలోచించి ఆమె ఓ నిర్ణయం తీసుకున్నారు.
భర్త కంపెనీలో సగం వాటా ఇస్తేనే ఉద్యోగం మానేస్తానని చెప్పారు. దీంతో స్నేహితులు భర్తతో ఇలా ప్రవర్తిస్తావా? అని అన్నారు. ఏం చేయాలో తెలియక ఆమె సలహా కోసం నెటిజన్లను కోరి పోస్ట్ చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. మరికొందరు పిల్లల బాధత్య చూసుకోవాలంటే ఇంట్లో ఉండి చూసుకోవాల్సిందే అని అన్నారు. ఎక్కువ మంది మీరు వాటా అడగడం మంచిదే అని తెలిపారు. ఆ తర్వాత తన భర్త కంపెనీలో 49శాతం వాటా ఇచ్చారని మళ్లీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.