»Jharkhand High Court Grants Bail To Former Jharkhand Chief Minister Hemant Soren Land Scam Case
Hemant Soren : హైకోర్టు నుంచి బెయిల్ పొందిన హేమంత్ సోరెన్.. సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈడీ
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. జార్ఖండ్ హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది
BJP strongly accuses Kejriwal behind the disappearance of Jharkhand CM Hemant Soren.
Hemant Soren : భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. జార్ఖండ్ హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నుండి బెయిల్ పొందిన తరువాత సోరెన్ ఐదు నెలల తర్వాత జైలు నుండి బయటకు రానున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జార్ఖండ్ హైకోర్టు జూన్ 13న సోరెన్ బెయిల్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మే 27న జార్ఖండ్ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. హేమంత్ సోరెన్‌పై 8.42 ఎకరాల భూ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి.
ఈడీ పలు కీలక ఆధారాలను హైకోర్టులో సమర్పించింది. బద్గైలో 8.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు హేమంత్ సోరెన్ అధికారుల సహాయం కూడా తీసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో పేర్కొంది. బాద్గై రెవెన్యూ ఉద్యోగి భాను ప్రతాప్, అతని ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్ అలియాస్ పింటూ విచారణలో ఈడీ వాదనను ధృవీకరించారని ఈడీ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుందని సోరెన్ పిటిషన్లో వెల్లడించనందున సోరెన్ పిటిషన్‌ను పరిశీలించడానికి కోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రచారం కోసం హేమంత్ సోరెన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే, జైలులో ఉన్న నేతలందరూ బెయిల్ కోసం డిమాండ్ చేస్తారని ఈడీ వాదించింది.
హేమంత్పై వచ్చిన ఆరోపణలేంటి?
రాంచీలోని బడగైలో 8.42 ఎకరాల భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ నిందితుడు. ఈ భూమి ల్యాండ్ కోటాకు చెందినది, దీనిని ఎవరూ కొనలేరు లేదా విక్రయించలేరని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఇదిలావుండగా 2010లో హేమంత్ దానిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత, హేమంత్ సోరెన్ స్థానిక అధికారుల ద్వారా ఈ భూమిని కొలిచే పనిలో బిజీగా ఉన్నారు. హైకోర్టులో హేమంత్ తరపు న్యాయవాది ఇడి ఆరోపణలను కల్పితమని అభివర్ణిస్తూ, ఆ భూమితో హేమంత్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తుల వాట్సాప్ చాట్లను, రెవెన్యూ అధికారి భాను ప్రతాప్ ప్రసాద్ వాంగ్మూలాలను సమర్పించింది.