Kalpana Soren is the reason behind the arrest of Hemant Soren.
Kalpana Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ పదవి కాలం పూర్తి చేయొద్దని కుట్రపన్ని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆయన సతీమణీ హేమంత్ సొరేన్ ఆరోపించారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ గందే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జేఎంఎం పార్టీ అభ్యర్ధిగా ఆమె బరిలో దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జార్ఖండ్
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని, ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని, బీజేపీకిి చిత్రశుద్ది ఉంటే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తన భర్త హేమంత్ సొరేన్ సీఎంగా ఆయన పదవిని పూర్తి చేయకుండా అడ్డుకున్నారని, ఎందుకంటే హేమంత్ తన పదవీకాలాన్ని పూర్తిచేస్తే పాతికేండ్ల వరకూ ఎవరూ టచ్ చేయలేని నాయకుడిగా ఎదుగుతాడని బీజేపీ భయపడిందని ఆరోపించారు. అందుకే కుట్రపూరితంగా బీజేపీ అరెస్ట్ చేయించిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇండియా కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.