»Pooja Hegde Pooja Hegde In Peekallothu Love Ready For Marriage
Pooja Hegde: పీకల్లోతు ప్రేమలో పూజా హెగ్డే.. పెళ్లికి రెడీ?
ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాలకు దూరంగా ఉంటోంది. అమ్మడికి ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. కానీ ప్రేమ విషయంలో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు.. త్వరలోనే పెళ్లికి కూడా రెడీ అయినట్టుగా సమాచారం.
Pooja Hegde: Pooja Hegde in Peekallothu love.. ready for marriage?
Pooja Hegde: గత కొద్ది రోజులుగా.. ఇక తెలుగులో పూజా పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది పూజా. అయినా కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది అమ్మడు. రీసెంట్గా.. ఏకంగా 45 కోట్లు విలువ చేసే ఇల్లు కొనుగోలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న ఒక లగ్జరీ ఇంట్లోకి షిప్ట్ అవడానికి రెడీ అవుతోందట పూజా. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఈ హాట్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్‌తో తెగ షికార్లు చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గా కారులో వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో.. పూజా ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య పూజా ఎక్కువగా రోహన్తోనే కనిపిస్తోంది. లేటెస్ట్గా పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. ఇక్కడ కూడా రోహన్ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ఇలాంటి వార్తల్లో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది.
కానీ ప్రస్తుతం పూజకు సినిమా ఛాన్స్‌లు తగ్గిపోయాయి కాబట్టి.. పెళ్లికి రెడీ అయిందనే టాక్ ఊపందుకుంది. అందుకే.. కొత్త సినిమాల కోసం ట్రై చేయడం లేదనే టాక్ నడుస్తోంది. పైగా ఈ మధ్య స్టార్ హీరోయిన్లంతా పెళ్లి బాట పడుతున్నారు. కాబట్టి.. త్వరలోనే పూజా కూడా పెళ్లి పీటలెక్కడం పక్కా అంటున్నారు. మరి పూజా హెగ్డే దీని పై స్పందిస్తుందేమో చూడాలి.